ఈ నెల 13న తిరుమలకు చంద్రబాబు దంపతులు..

ఈ నెల 13న తిరుమలకు చంద్రబాబు దంపతులు..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 12న (బుధవారం) చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారు.. అదే రోజు రాత్రికి ఆయన తిరుమలకు బయలుదేరతారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి.. 13వ తేదీ (గురువారం) ఉదయం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.