చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం…
విజయవాడ పరిధిలోని మధురానగర్లో బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు గురువారం మధ్యాహ్నం మధురానగర్ వద్ద ఉన్న రైలు వంతెనపైకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు.
రైలు బ్రిడ్జిపై నడిచి బుడమేరు ఉధృతిని పరిశీలించారు. రైలు వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు తగలకుండా సిఎం ఓ పక్కకు నిలబడ్డారు. చంద్రబాబుకు అతి సమీపంగా రైలు వెళ్లింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలు వెళ్లిపోయాక అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.