ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన...

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-  ఆంధ్రప్రదేశ్ రాజధాని పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక సిటీగా తయారు చేస్తామని అన్నారు. అలాగే కర్నూలు ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజావేదికలా కూల్చివేతలు ఉండవని అన్నారు. 3 రాజధానుల్లా రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలు ఉండవని పేర్కొన్నారు. విశాఖలో సునామీలా మెజార్టీలు వచ్చాయని అన్నారు. నువ్వు రావొద్దని జగన్‌కు విశాఖ ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాయలసీమలోనూ ఊహించని మెజార్టీలు ఇచ్చారని తెలిపారు. జగన్‌పై రాయలసీమ  తిరుగుబాటు చేసిందని వ్యాఖ్యానించారు. సీఎంగా ఉన్నా మామూలు మనిషిగానే వస్తా అని అన్నారు. పరదాలు కట్టం, చెట్లు కొట్టేయం అని జగన్ కు కౌంటర్ ఇచ్చారు. స్టేట్‌ ఫస్ట్‌ అనే నినాదంలో ముందుకెళ్తాం అని అన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..

“1994లోనూ ఇన్ని సీట్లు, ఓట్లు రాలేదు. 11 సీట్లే ఓడిపోయాం. 93 శాతం విజయాన్ని మనం అందుకున్నాం. 57 శాతం మంది మనల్ని కోరుకున్నారు. అన్‌స్టాపబుల్‌గా ఎంపీ, అసెంబ్లీ సీట్లను గెలిచాం.‌ అభ్యర్థిగా గట్టిగా నిలబడిన చోట జనం గెలిపించారు. ప్రజల తీర్పుతో ఢిల్లీలోనూ మనకు గౌరవం పెరిగింది. పవన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఓట్లు బదిలీ అవుతాయా లేదా అన్న భయం ఉండేది. కూటమి ఏర్పడటానికి పవన్‌ చాలా కృషి చేశారు. బీజేపీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. ఇంతటి కష్టం నేనెప్పుడూ చూడలేదు.

అందుకే ఇంతటి గెలుపు వచ్చింది. రేపు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. 4వ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను కానీ ఈసారి బాధ్యత ఎంతో ఉంది. రాష్ట్రానికి కేంద్రం సాయం చాలా అవసరం. రాష్ట్ర అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారు. పదవితో విర్రవీగారు, అహంకారం కూలిపోయింది. బూతులు మాట్లాడే వ్యక్తుల్ని, అరాచక శక్తుల్ని ఓడించారు. కక్ష తీర్చుకోవాలని అనుకుంటే మనకు కూడా సమస్య వస్తుంది. తప్పు చేసిన వారిని వదిలిపెడితే మళ్లీ అదే చేస్తాం. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారం శిక్షపడాలి.” అని అన్నారు