శిక్షల పెంపుతోనే సమాజంలో మార్పు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

శిక్షల పెంపుతోనే సమాజంలో మార్పు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: శిక్షల పెంపుతోనే సమాజంలో మార్పు వస్తుందని నేరం చేసిన వారికి శిక్ష తప్పదనే భయం కలిగిస్తే  సమాజంలో చాలా వరకు నేరాలు కంట్రోల్ లో ఉంటాయని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో  సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగుతుందని అన్నారు. కేసుల్లో శిక్షల అమలు, పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి పలువురు కోర్టు కానిస్టేబుళ్లను అడిగి కేసుల పురోగతిపై సూచనలు చేశారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు, కోర్టులో పెండింగ్ కేసులపై, వారెంట్స్, సమన్స్ తదితర అంశాలను సమీక్షించారు. 

ఈ సందర్భంగా మెగా లోక్ అదాలత్ లో రాజీమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, సిబ్బంది  పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి లోక్ అదాలత్ లో జిల్లా పరిధిలో 12492  కేసులు పరిష్కరించి రాష్ట్రంలోని  10 వ స్థానం లో నిలిచేల  వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ  ప్రత్యేకగా  అభినదించి ప్రశంస పత్రం  అందజేశారు. ఈ యొక్క సమావేశం లో అదనపు ఎస్పీ ప్రభాకర రావు , డిఎస్పీ వెంకటస్వామి, ఎస్ బి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, సి ఎం ఎస్  ఎస్.ఐ రాజు నాయక్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ పాల్గొన్నారు.