ఇటుక బట్టీ కార్మికుల పిల్లల కోసం పని ప్రదేశంలో శిశు సంరక్షణ కేంద్రం

ఇటుక బట్టీ కార్మికుల పిల్లల కోసం పని ప్రదేశంలో శిశు సంరక్షణ కేంద్రం
  • ప్రారంభించిన జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి

ముద్ర,వనపర్తి: ఇటుకలు పట్టుకోవడం అలవాటు చేసుకున్న వారి చిన్ని చేతులు మొదటిసారిగా పాలక,బలపం పట్టుకున్నాయి. వారిలో చాలామంది ఇంతకు ముందు స్కూల్ డ్రెస్ వేసుకోలేదు. సరైన స్కూల్‌కి వెళ్లలేదు. మంగళవారం రోజున వనపర్తి జిల్లా మెట్టుపల్లీ  గ్రామంలో ఒడిశాకు చెందిన ఇటుక బట్టీ కార్మికుల పిల్లల కోసం పని ప్రదేశంలో సంరక్షణ కేంద్రం వర్క్‌సైట్ పాఠశాలను ప్రారంభించినప్పుడు, వారు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చిన్నారుల వయస్సును బట్టి కొత్త యూనిఫారాలు, స్లేట్లు లేదా నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, పెన్సిళ్లు మరియు పెన్నులు పొందారు.జిల్లా ఎస్పీ  రక్షిత కే మూర్తి, ఏడీ ఎట్ యాక్షన్ స్వచ్ఛంద సంస్థ (NGO) సురేష్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ (సిడిపిఓ) ఆధ్వర్యంలో 49 మంది వలస కూలీల పిల్లలను పాఠశాలలో చేర్పించి తరగతులు ప్రారంభించారు.

ఎయిడ్ ఎట్ యాక్షన్ మల్టీ-గ్రేడ్ టీచింగ్‌లో శిక్షణ పొందిన  వాలంటీర్ ఉపాధ్యాయులలను ఏర్పాటు చేసి 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నర్సరీ నుండి నుండి 2 తరగతి వరకు తరగతులు ప్రారంభించారు. ఎన్ జి ఓ  పాఠ్యపుస్తకాలు, స్కూల్ బ్యాగులు బూట్లు యూనిఫామ్, పెన్సిల్లు నోట్ పుస్తకాలు పలుకలు పెన్నులు అందించారు.చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో చిన్నారులకు పప్పు బియ్యం కోడిగుడ్లు బాలామృతం, మొదలైన పౌష్టిక ఆహారాన్ని అందించనున్నారు.ఇట్టి కార్యక్రమంలో ఎన్జీవోస్ మరియు సిడిపిఓ సిబ్బంది వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ  నాగభూషణం, ఆత్మకూరు సిఐ శివ కుమార్, ఇన్చార్జి ఎస్ఐ అంజద్ ,వనపర్తి టౌన్ ఎస్ఐ జయన్న గారు రామరాజు గారు భరోసా సెంటర్ సిబ్బంది షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.