టీచర్‌ను చెప్పులతో కొట్టిన విద్యార్థులు ...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలకు ఓ టీచర్ ప్రతి రోజూ మద్యం తాగి వస్తున్నాడు. దీనిపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా మంగళవారం కూడా ఇలాగే మద్యం తాగి ఆ టీచర్ స్కూల్‌కు వచ్చాడు. దీంతో ఆయనపై పిల్లలు చెప్పులు విసిరారు. వాటి నుంచి తప్పించుకునేందుకు బైక్‌పై ఆ టీచర్ వెళ్లిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.