Flood Relief Fund - తెలుగు రాష్ట్రాల‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి

Flood Relief Fund - తెలుగు రాష్ట్రాల‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి

భారీ వ‌ర్షాల కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అత‌లాకుత‌ల‌మైన విష‌యం తెలిసిందే. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారు రోజులు గ‌డుస్తున్నా ఇంకా బిక్కుబిక్కుమంటూనే గ‌డుపుతున్నారు. చాలా మంది నిరాశ్ర‌యుల‌య్యారు. దీంతో వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మవంతు సాయం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తెలుగు రాష్ట్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌కు చెందిన వారు విరాళాలు అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఎన్‌టీఆర్‌, మ‌హేశ్ బాబు, వైజయంతీ మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్‌, యువ హీరోలు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, విష్వ‌క్సేన్ త‌దిత‌రులు వ‌ర‌ద స‌హాయ నిధికి విరాళాలు ప్ర‌క‌టించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలుగు రాష్ట్రాల‌కు రూ.కోటి విరాళం ప్ర‌క‌టించారు.