దేశభక్తిని చాటుదాం  ఇంటిపై జాతీయ జెండా ఎగరవేద్దాం

దేశభక్తిని చాటుదాం  ఇంటిపై జాతీయ జెండా ఎగరవేద్దాం
  • బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ప్రతి ఒక్కరు ఇంటింటా జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ పిలుపునిచ్చారు. మంగళవారం హర్ ఘర్ తిరంగా  కార్యక్రమం లో భాగంగా బిజెపిమహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ  ఆధ్వర్యంలో మంగళవారం భారీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య ఆతిథి గా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  కరీంనగర్ పట్టణం భగత్ నగర్ లోని  భగత్ సింగ్ విగ్రహం వద్ద మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించారు.

ఇట్టి ర్యాలీ భగత్ నగర్,  గణేష్ నగర్, కమాన్, బస్టాండ్ ,తెలంగాణ చౌక్,   రాంనగర్ సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా , బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు  మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా జరుపుకోవాలని , భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు. హర్ ఘర్ తిరంగా ఓ గొప్ప ప్రోగ్రాంమని, దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన  కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.

ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి, దేశభక్తిని చాటి చెప్పాలన్నారు. హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. బిజెపి శ్రేణులు అందరూ ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి, తమ తమ ప్రాంతాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడానికి తగిన కృషి చేయాలన్నారు.   దేశభక్తిని చాటి చెప్పే విధంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అద్భుతమైన ఇట్టి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి మహిళలు,  విద్యార్థినిలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వారందరి సహకారంతో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభక్క,  హాజరై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో  గుగ్గిళ్ళ రమేష్, వాసుదేవ రెడ్డి, వంగళ శ్రీదేవి పవన్, కాసర్ల లక్ష్మీ ఆనంద్, కోలగాని స్వర్ణ శ్రీనివాస్, నిర్మల రెడ్డి, దేశ శిల్ప, లావణ్య రెడ్డి, సుధా వైష్ణవి, సునీత, అరుణ, కొత్తపల్లి అరుణ, కన్నంబ, నాంపల్లి శ్రీనివాస్, రమేష్, పార్టీ శ్రేణులు కార్యకర్తలు,మొదలగువారు పాల్గొన్నారు