శోభాయమానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం

శోభాయమానంగా రామలింగేశ్వరుడి నగరోత్సవం

నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

అడుగడుగునా భక్తుల నీరాజనాలు

అలరించిన కోలాట ప్రదర్శనలు

ముద్ర ప్రతినిధి, నల్గొండ: నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలను పురస్కరించుకొని స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల నగరోత్సవం బుధవారం రాత్రి నల్గొండ పట్టణంలోని రామాలయం నుండి ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన వాహనంలో ఆట్టి ఉత్సవమూర్తులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అషినులను పూజల్లో పాల్గొని కొబ్బరికాయలను సమర్పించి నగరోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రామాలయం నుండి బయలుదేరిన ఊరేగింపు పట్టణ పూరవీధుల నుండి సాగింది, అడుగడుగున స్వామి వారికి నీరాజనాలు పలికారు, కోలాట మహిళా బృందాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, దారిపోడుగున సాగాయి. ప్లడ్ లైట్ల వెలుతురులో స్వామి వారి ఊరేగింపు భక్తి పార్వశంతో సాగింది. ఈ నెల 16వ నాడు స్వామి వారి కల్యాణ మహోత్సవం జరగనున్నది. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, బత్తుల ఉషయ్య, ఆలయ ఈవో, చెర్వుగట్టు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.