అంబరాన్నంటిన పట్టణ ప్రగతి సంబరాలు 

అంబరాన్నంటిన పట్టణ ప్రగతి సంబరాలు 
  • పారిశుధ్య వాహానాల ర్యాలీని ప్రారంభించిన గంగుల, వినోద్ కుమార్
  • కార్మికులతో సహఫంక్తి భోజనం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో పట్టణ ప్రగతి సంబాల వేడుకలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శుక్రవారం రోజు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యుల ఆద్వర్యంలో పట్టణ ప్రగతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఆవరణలో కమీషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యులతో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేస్తూ పట్టణ ప్రగతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో పాఠశాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల లోగో రూపంలో  మానవహారం చేశారు. అనంతరం మెప్మా సిబ్బంది, మహిళ సమైక్య సంఘాల సభ్యలు రంగోలి పోటీల్లో పాల్గొని అందమైన ముగ్గులు వేశారు.

స్థానిక అంభేడ్కర్ ఇండోర్ స్టేడియం లో  నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య రక్షణ కోసం సేవలందిస్తున్న పారిశుధ్య విభాగం వాహానాలు, యంత్రాల పదర్శన ర్యాలీ జరిగింది. పారిశుధ్య వాహానాల ప్రదర్శన ర్యాలీని మేయర్ యాదగిరి సునీల్ రావు,  సుడా చైర్మన్ జీ. వి  రామకృష్ణ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యులతో కలిసి మంత్రి గంగుల , ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పచ్చజెండా ఊపీ వాహానాల ప్రదర్శన, ర్యాలీని ప్రారంభించారు. పారిశుధ్య వాహానాల ర్యాలీ స్టేడియం నుండి తెలంగాణ చౌక్, ఐబీ గెస్ట్ హౌజ్, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా మీదుగా కాపువాడ నుండి కమాన్ చౌరస్తారకు ర్యాలీ సాగింది. పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న వివిద యంత్రాల పనితీరును ప్రజలకు తెలిసేవిదంగా ప్రదర్శించడం తో తెలంగాణ చౌక్ వద్ద ముఖ్య అతిథులు మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లు వీక్షించారు. 

అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, కార్మీకులు, మెప్మా మహిళ సంఘాల సభ్యల సిబ్బంది తో భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీని కమీషనర్ సేవా ఇస్లావత్, పలువురు కార్పోరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి మేయర్ యాదగిరి సునీల్ రావు ర్యాలీ ప్రారంభం చేసి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు నగర పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, తడి పొడి చెత్త వేరు తదితర అంశాలపై నినాదాలు చేస్తూ ర్యాలీతో పద్మనాయక ఫంక్షన్ హాల్ చేరుకున్నారు అనంతరం ఫంక్షన్ హాల్ లో పట్టణ ప్రగతి సంబరాల సభను ఏర్పాటు చేశారు. మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ ఆద్వర్యంలో జరిగిన  పట్టణ ప్రగతి సంబరాల్లో కూడ మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణ ప్రగతి పథకం ద్వారా నగరపాలక సంస్థ సాధించిన ప్రగతి నివేదిక బుక్ లెట్ ను ఆవిష్కరించారు. పట్టణ ప్రగతి లో రాష్ట్ర ప్రభుత్వం తో పాటు నగరపాలక సంస్థ సాదించిన ప్రగతి చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న సేవల వీడియో ప్రదర్శనను కార్మీకులతో కలిసి వీక్షించారు. 

సమావేశం ఉత్తమ కార్పోరేటర్లకు గౌరవ సత్కారం చేసి మంత్రి  ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తమ చేతులు మీదుగా ప్రశంస పత్రం, షీల్డ్ ను ప్రదానం చేశారు. అంతే కాకుండా వివిధ విభాగాల్లో పని చేస్తున్న ఉత్తమ అధికారులు, ఉద్యోగులు, పారిశుధ్య కార్మీకులు, ఉత్తమ వర్మికాంపోస్టు, పబ్లిక్ టాయిలెట్ నిర్వహాకులక ప్రశంస పత్రం అందజేసి సత్కరించారు. నగరపాలక సంస్థ స్టీట్ వెండర్లకు వ్యాపారం కోసం ఇచ్చే ఆర్థిక సాయం చెక్కును పంపిణీ చేశారు. వెండర్లకు అధిక రుణాలు మంజూరు ఆర్థిక ప్రోత్సహాం ఇచ్చిన ఉత్తమ బ్యాంకు లకు ప్రశంస పత్రం అందజేశారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కమీషనర్ సేవా ఇస్లావత్, కార్పోరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్మీకులు అదికారులు సిబ్బంది తో కలిసి సహాపంక్తి భోజనం చేశారు.