నైట్ ఆల్ట్ బస్సు పునరుద్ధరించాలని సంతకాల సేకరణ

నైట్ ఆల్ట్ బస్సు పునరుద్ధరించాలని సంతకాల సేకరణ

మోత్కూర్ (ముద్ర న్యూస్): నల్లగొండ నుండి మోత్కూరు కు నైట్ హాల్ట్ బస్సు లేకపోవడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు, ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బిఆర్ఎస్ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం మోత్కూర్ బస్టాండ్ లో సంతకాల సేకరణ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నైట్ హాల్ట్ బస్సు గతంలో నార్కట్ పల్లి నుండి మోత్కూరు కు కొనసాగి,ప్రసుతం దాదాపు ఏడాది నుంచి రద్దు కావడంతో విద్యార్థుల , ప్రజల దృష్ట్యా ఈ మేరకు ఆ బస్సు వెంటనే  మళ్ళీ పునరుద్ధరించాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ లో ప్రయాణికులతో సంతకాల సేకరణ  కార్యక్రమం చేపట్టారు.దాదాపు రెండున్నర దశాబ్దాలుగా నాడు నార్కట్ పల్లి డిపో ఉన్న సమయంలో ప్రతి రోజు (  రెగ్యులర్ గా)  నార్కట్ పల్లి నుండి రాత్రి 8:15 నిమిషాలకు బయలు దేరి మోత్కూరు కు 9;30 నిమిషాలకు చేరుకునేదనితిరిగి ఉదయం 5;30 నిమిషాలకు నార్కట్ పల్లి కి వెళ్ళేదన్నారు.

తధ్వారా విద్యార్థులకు, ప్రయాణికులకు ఈ బస్సు ఎంతో సౌకర్యంగా  ఉందేదని చెప్పారు. గత ఏడాది వరకు నడిచిన ఈ బస్సు ను నార్కట్ పల్లి డిపో ఎత్తి వేయడం వల్ల నార్కట్ పల్లి డిపోనునల్లగొండ లో కలపడం వల్ల  రెండున్నర దశాబ్దాల నుంచి నడుస్తున్న ఈ బస్సును రద్దు చేయడం ఆర్టీసీ అధికారులకు ఏ మాత్రం సమంజసం కాదన్నారు. ఈ బస్సు లేకపోవడం వల్ల ఉదయం 7;30 నిమిషాల వరకు ఒక్క బస్సు నార్కట్ పల్లి, నల్లగొండ కు  లేదని తధ్వారా మోత్కూరు ప్రజలతో, అనాజీపూరం ,పొడిచేడు, అమ్మన బోలు,  పల్లెపహాడ్, అక్కేనపల్లి  ప్రజలు, విద్యార్థులు, యువత త్రీవ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

నార్కట్ పల్లి లో కామినేని హాస్పిటల్ ఉన్నందున్న   వైద్య కోర్సులు చదివే విద్యార్థులకు ఉదయం 8 :00 గంటలకు తరగతులు ప్రారంభమౌతున్నాయని ఈ బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిచలేక ఉన్నత విద్యకు నోచుకోలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, విద్యార్థుల కోరిక మేరకు గతంలో మాదిరిగానేఇట్టి బస్ ను పునరుద్ధరణ చేయాలని అన్నారు. ఇటివల  గ్రూప్ 4 పరీక్ష నల్లగొండ సెంటర్ వచ్చిన అభ్యర్థులకు అనేకమంది ఈ బస్సు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ సంతకాల సేకరణ"ను 4, 5 రోజుల్లో  నల్లగొండ  ఆర్టీసీ డి.ఎం.కు , ఆర్.ఎం.కు అందజేయనున్నట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు నిమ్మల శ్రీనివాస్ యాదవ్, బయ్యని రాజు,అవిశెట్టి అవిలిమల్లు,పట్టణ అధ్యక్షులు నిలిగొండ మత్స్య గిరి, నాయకులు సి.హెచ్.స్వామి, నర్సింహ్మ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.