కలెక్టర్ సుడిగాలి పర్యటన

కలెక్టర్ సుడిగాలి పర్యటన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పట్టణంలో పలు కార్యక్రమాల్లో మంగళ వారం పాల్గొన్నారు. ముందుగా స్థానిక బస్ స్టేషన్ ను సందర్శించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించేందుకు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం మున్సిపల్ పరిధిలోని ధర్మసాగర్, వైకుంఠ ధామం, సిర్గాపూర్ లోని నర్సరీ, ఫిల్టర్ బెడ్, బంగల్ పేట్ లో పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం పరిశీలించారు. ధర్మసాగర్ చెరువు దగ్గర నిర్మించే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్థలాన్ని, బైల్ బజార్ దగ్గర నిర్మిస్తున్న స్మశాన వాటిక పనులను పరిశీలించి త్వరగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిద్దాపూర్ లో నిర్వహిస్తున్న నర్సరీ, వాటర్ హెడ్ వర్క్ లను పరిశీలించారు. మునిసిపల్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించి త్వరగతిన బయో మైనింగ్ పనులను చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటన లో మునిసిపల్ కమీషనర్ సివియన్ రాజు, డిఈ సంతోష్, ఏఈ లు వినయ్, హరిభువన్, టిపిఓ సుమలత, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.