దగాకోరు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించండి!

దగాకోరు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించండి!

  • బ్రాహ్మణీయ, హిందుత్వ పాసిస్టు ప్రమాదం నుండి దేశాన్ని, ప్రజలను కాపాడండి!... 
  • భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేయండి. ప్రజల విప్లవ రాజకీయాధికారాన్ని స్థాపించండి!
  • బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీని, దానితో అంటకాడుతున్న పార్టీలన్నింటిని తన్ని తరమండి... 
  • భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: 16వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రపదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా 2024 ఏప్రిల్ నుండి జూన్ వరకు జరుపుతున్నారని, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీని, దానితో అంటకాడుతున్న పార్టీలన్నింటిని తన్ని తరమండని, భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జగన్ పేరిట లేక విడుదల చేశారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో తమ గెలుపు కోసం అధికార పార్టీలతో సహా ప్రతి పక్ష పార్టీలన్నీ ప్రజలను మళ్ళీ మళ్ళీ మోసగించడానికి తమ ప్రణాళికలను సిద్దం చేసుకున్నాయని,  2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పాలక పార్టీలన్నీ ఓట్ల కోసం వేల కోట్ల డబ్బును, మద్యంను పంచిపెట్టిన తాజా సంగతులు ప్రజలందరికి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో కూడా అధికారాన్ని చేపట్టడానికి ధనబలం, కండబలం, మద్యం, కుల, మత రాజకీయాలతో సిద్దమయ్యారని, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య పాలక వర్గాల ముఠాలు కులతత్వ, మతతత్వ, ప్రాంతీయ రాజకీయాలతో బ్రష్టు పట్టించిన పార్లమెంట్ వ్యవస్థను మరోసారి అపహాస్యం చేయడానికి సిద్దమయ్యాయని,  మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు దళారీ నిరంకుశత్వాన్ని చట్టబద్దం చేసి దాన్ని పటిష్టం చేసే ఒకే ఒక లక్ష్యంతో నిర్వహించబడుతున్నాయని,  అధికారాన్ని చేపట్టాకా ఇక్కడ కార్యనిర్వహక వర్గమే అన్ని నిర్ణయాలను ఆర్డినెన్సలను జారీ చేస్తుందని, దోపిడి అనుకూల విధానాలను నిరంకుశంగా అమలు జరుపుతుందని, నిరంకుశ అధికారాన్ని ప్రజాస్వామ్యం పేరుతో చలామణీ చేస్తూ పీడిత ప్రజలను మోసగించి, అణిచి వేసి నిరంకుశత్వాన్ని నిలుపుకునే సాధనంగా పార్లమెంట్ ను తయారు చేశారు.

పార్లమెంట్, అసెంబ్లీలు నామమాత్రమే. అందుకే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది వట్టి బూటకమని, ఈ బూటకపు పార్లమెంట్ వ్యవస్థలో విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు, సామ్రాజ్యవాదులకు సేవకులుగా పని చేయడానికి పాలక వర్గ ముఠాలు అధికారం కోసం బీజేపి నాయకత్వంలోని ఎన్డీవి, కాంగ్రేస్ నాయకత్వంలోని ఇండియా కూటములు పోటి పడతున్నాయని తప్పా, ప్రజల ప్రయోజనాల కోసం ఏ మాత్రం కాదని, ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న బీజేపి 2019లో జరిగిన 17వ పార్లమెంట్ ఎన్నికల ముందు కుట్ర పూరితంగా పుల్వామా సంఘటనను సృష్టించి, హిందూ మతోన్మాదాన్ని, జాతీయోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల ఓట్లను దండుకున్నదని,  ఆర్ఎస్ఎస్, బీజేపిలు ఈ సారి కూడా అలాంటి దుర్మార్గపు, కుట్ర పూరిత పన్నాగం పన్నారు. ఎన్నికల ముందు అయోధ్యలో రెండు మతాల ప్రజల మద్య చిచ్చురేపే రామమందిరాన్ని రెండు వేల కోట్లతో నిర్మించి రాజ్యంగ విరుద్ధంగా, నిరంకుశంగా ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభించి రాజకీయం చేసిన విషయం ప్రజలందరికి విధితమే. ఈ రోజు సిఐఏను అమల్లోకి తీసుకొచ్చింది. రేపు ఎలాంటి దుశ్చర్య వుండబోతుందో ఉహించడం కష్టమేమి కాదని, ఎన్నికల కమీషన్ ను నామమాత్రం చేసి ఈ ఎన్నికలను కూడా తమకు అనుకూలంగా మార్చు కోవడం కోసమే మూడు నెలల పాటు ఎన్నికల తతంగాన్ని నిర్వహిస్తున్నారు.


పదేండ్ల మోది పరిపాలనలో మద్య యుగాల నాటి ప్యూడల్ నిరంకుశత్వ హిందుత్వ రాష్ట్రాన్ని స్థాపించే లక్ష్యంతో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని అమలు చేస్తూ దేశాన్ని ప్రమాదకరమైన సంక్షోభంలోకి నెట్టారు. సామ్రాజ్యవాదుల, భూస్వామ్మ వర్గాల దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నమ్మిన బంటులా పని చేస్తున్నాడని, మన దేశ సంపద, గనులు, అడవులు, భూములు, వ్యవసాయం, విద్య, వైద్యం, విమానాశ్రయాలు ఓడరేవులు ఒకటేమేటి ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్థులను సరుకుగా చేసి కారు చౌకగా అమ్మేస్తున్నారు. డిజిటల్  ప్రోత్సహిస్తూ మేక్ ఇన్ ఇండియా అంటూ ఉదరగొట్టుకుంటున్నారు. నరేంద్ర మోదీ పాలనలో దోపిడి వర్గాల అనుకూల విధానాల వలన ఒక శాతం వున్న సంపన్నుల సంపద దేశ సంపదలో 40 శాతంగా వున్నట్లు సర్వే నివేధికలు చెపుతున్నాయి. దేశంలో ఎనిమిది లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూత పడేయడం వలన లక్షలాది మంది శ్రామికులు ఉపాది కోల్పొయారు. లేఆఫ్, వీఆర్ఎస్ పేరుతో 2.7 లక్షల ఉద్యోగాలను తొలిగించారు. ఫలితంగా ఆర్ధిక అసమానతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆకలి దారిద్య్ర్యం. పేదరికం 70 శాతానికి, నిరుద్యోగం కోట్లల్లో పెరిగింది. నేడు పాపిక ఆహారం దొరకని, కొనుగోలు శక్తి లేని జనాభా దాదాపు 70 శాతనికి పెరిగి దారద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారని సర్వేలు చెపుతున్నాయి.

అంటే మన దేశం పేదరికంతో, నిరుద్యోగ్యంతో, అధిక ధరలతో, పన్నుల భారంతో ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వాస్తవాన్ని మసి పూసి మారోడు కాయ చేయడానికి అబద్దాల కోరు మోదీ 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చా మంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మోదీ వాగ్దానాలతో కార్మికులను, రైతాంగాన్ని, మధ్య తరగతి ప్రజలను, దళితులను, మహిళలను, ఆదివాసులను, మత మైనార్టీలను ఎంత మోసగించారో. కోట్లల్లో ఉద్యోగ, ఉపాది కల్పిస్తామన్న వాగ్దానం ఎంత బూటకమో అర్థమవుతుంది. ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల ప్రకారం భారత దేశం జీడిపి వృద్ధి రేటు 3.7 ట్రిలియన్ల డాలర్లు మాత్రమే. కాని 8.4 శాతం వృద్ధి రేటును సాధించినట్లుగా చూపిస్తున్నారు. మన దేశం కేవలం దిగుమతులపై మాత్రమే ఆధారపడుతున్నది. విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉత్పతులన్నీ మన దేశంలో నెలకొల్పిన బహుళ జాతి కంపెనీలపే. అందులో కేవలం చాటా దారు మాత్రమే. దేశ దారిద్ర్యం ఇలా వుంటే ప్రజలను నమ్మించి మోసగించడానికి మోదీ మాత్రం వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా ఆర్ధిక అభివృద్ధిని సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నాడు, మోదీ అబద్దాలను. అర్థ సత్యాలను, సత్తాలేని ఊక దంపుడు ఉపన్యాసాలను, మోదీ నిరంకుశ సారథ్యాన్ని రోజు ఆకాశానికెత్తడమే పనిగా గోదీ మీడియా పెట్టుకుంది.

మోదీ పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలలో నేరుగా ఆర్.ఎస్.ఎస్. రాజకీయాలను నెరుపుతున్నాడు. అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను తన గుప్పెట్లో పెట్టుకొని సర్వం తానై పాలిస్తు వస్తున్నాడు. రాజ్యాంగ బద్ద సంస్థలైనా ప్రణాళికా సంఘం, సీబీఐ, సీవీసీ, ఈడీ, ఆర్.బీ.ఐ. చివరికి న్యాయవ్యవస్థ స్వతంత్రతను సైతం దెబ్బతీసాడు. ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే జాతి, ఒకే నాయకుడు అంటూ శాశ్వత నిరంకుశ పాలన దిశగా తీసుకుపోతున్నాడు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను కుట్ర పూరితంగా కూల్చి ఫెడరల్ వ్యవస్థను ద్వంసం చేస్తుంది. ప్రజా ఉద్యమాలపై ఉక్కు పాదం మోపుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక, రాజకీయ స్వేచ్ఛను, పౌర హక్కులను, సార్వభౌమత్వాన్ని, స్వాలంభనను.. బ్రహ్మణీయ హిందుత్వ ఫాసిజం ద్వారా ద్వంసం చేశాడు. సామాజిక విప్లవం చేస్తున్న మావోయిస్టు పార్టీ నిర్మూలనకు భారత సైన్యాల ద్వారా కగార్ పేరుతో నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రకటించాడు. ప్రజలారా! మరోసారి బీజేపి అధికారంలోకి తీసుక రావడం అంటే తల కొరివి పెట్టుకోవడమే. ఈ రోజు చెపుకుంటున్న నామమాత్రపు ప్రజాస్వామ్య కూడా ద్వంసం అయిపోయి భయాంకరమైన దుర్భర పరిస్థితులను కొని తెచ్చుకోవడమే. అందుకే బీజేపిని, దానితో అంటకాగే పార్టీలన్నింటిన తన్ని తరమండన్నారు.


అదే విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి అధికారాన్ని చేపట్టే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిందని,  మొట్ట మొదట దేశంలో ప్రపంచీకరణకు పునాదులు వేసిన కాంగ్రేస్ మరోసారి ప్రజలను దగా చేయడానికి అధికారం కోసం ఆరాటపడుతుందని, కాని ఇండియా కూటమి అనే కలగూర గంపలో వున్న వైరుధ్యాల వలన ఇంకా ఐక్యం కాలేక పోతున్నారు. బీజేపిని ఓడించడానికి గాని, హిందూ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని అడ్డుకునే పథకం గాని ఈ కూటమికి లేదని, సామ్రాజ్య వాదులకు, కార్పొరేట్లకు పాదసేవా చేసుకోవడానికి, ప్రపంచ పోటీ మార్కెట్లో దేశాన్ని అమ్మివేయడానికి ఐదేళ్ళ అధికారం కోసం పాలక ముఠాల మధ్య కోట్లాడుకోవడం తప్పా వీరి వలన భారత ప్రజలకు ఒరిగేది ఏమిలేదని, పార్లమెంట్ పార్టీలన్నీ నిజమైన ప్రజాస్వామ్యానికి, స్వాలంభనకు, సార్వభౌమత్వానికి పూర్తి వ్యతిరేకమైనవి, పీడిత ప్రజలపై దుర్మార్గపు పాలన కొనసాగించడంలో వీటి మద్య పెద్ద తేడా ఏమి వుండబోదు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రత్యమ్నాయ రాజకీయాధికారం కావాలని,  ప్రజల రాజ్యాధికారాన్న సాధించుకోవడానికి నూతన ప్రజాస్వామిక విప్లవం లో భాగస్వామం కావాలని జగన్ పిలుపునిచ్చారు.