హద్దు రాళ్లు తొలగింపుపై ఫిర్యాదు

హద్దు రాళ్లు తొలగింపుపై ఫిర్యాదు

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని చిక్కేపల్లి గ్రామంలో బీసీ లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో హద్దురాలను తొలగించి చదును చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ మాజీ సర్పంచ్ ముంత బాలస్వామి యాదవ్ గ్రామ నాయకులు వెంకట రాములు, ఖాదర్, రాము, నరసింహస్వామి,అంజి,టైగర్ రాములు తదితరులు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ కు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. గత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి,ఇన్చార్జి తాసిల్దార్ చక్రపాణి ఆధ్వర్యంలో గ్రామంలోని 65 మంది లబ్ధిదారులకు సర్వేనెంబర్ 361 లో ఇండ్ల స్థలాలకు పట్టా సర్టిఫికెట్లను అందజేశారన్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన  కొంతమంది వ్యక్తుల ప్రోత్సాహంతో చత్రపతి అనే వ్యక్తి జెసిబి సహాయంతో ప్లాట్లలో పాతిన హద్దురాలను తొలగించి చదును చేశారన్నారు హద్దురాలను అక్కడి నుండి అపహరించుక వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారికంగా ఇచ్చిన ప్లాట్ల లో హద్దురాలను తొలగించి చదును చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు.