గోల్డ్ మెడల్ విజేత డాక్టర్ బంటు కృష్ణకు కొనసాగుతున్న అభినందనల వెల్లువ

గోల్డ్ మెడల్ విజేత డాక్టర్ బంటు కృష్ణకు కొనసాగుతున్న అభినందనల వెల్లువ

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: జర్నలిజం లో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టాతోపాటు గోల్డ్ మెడల్ విన్నర్ గా నిలిచిన సూర్యాపేట కు  చెందిన డాక్టర్ బంటు కృష్ణ ఫిబ్రవరి 28వ తేదీన నాటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అవార్డు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే డాక్టరేట్ పట్టా తోపాటు గోల్డ్ మెడలిస్ట్ కూడా కావడంతో ఆనాటి నుండి అరుదైన ఘనతను సాధించిన డాక్టర్ బంటు కృష్ణను రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు, స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు ఘనంగా సన్మానిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా మంగళవారం మొదటగా సూర్యాపేట మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్  సారగండ్ల శ్రీనివాస్, జవాన్ లు హనుమంత్ నాయక్, ప్రసాద్, సురేష్ లు పూలబోకే అందించి శాలువా కప్పి సన్మానించారు.

తదుపరి చార్మినార్ ఎక్స్ప్రెస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి వెంకటేష్, ఎన్టీవీ రిపోర్టర్ బత్తుల మల్లికార్జున్, శ్రీనివాస్ యాకయ్య లు శాలువాగప్పి ఘనంగా సన్మానించారు. తదనంతరం సూర్యాపేటకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్, మన్సూర్ ఫ్లెక్సీ యజమాని మన్సూర్ భాయ్, జానీ, జమీల్, జహీర్  భాయ్ లు ఘనంగా సన్మానించి స్వీట్లు పంచారు.

అనంతరం పంచాయతీ సెక్రటరీలు గుండు నాగరాజు గౌడ్ జూలకంటి రామ్ రెడ్డి లు బోకే అందించి, స్వీట్ తినిపించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్య విలువను గుర్తించి, విద్యలో  ప్రతిభను చాటి  గోల్డ్ మెడల్ పొంది విద్యారంగంలో అగ్ర శిఖరాలకు చేరుకోవడం అందరికి సాధ్యం కాదని, పట్టు వదలని విక్రమార్కుడిలా అహర్నిశలు శ్రమించి  డాక్టరేట్ పట్టా తో పాటు గోల్డ్ మెడల్ తో సూర్యాపేట పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన డాక్టర్ బంటు కృష్ణ అందరికీ ఆదర్శప్రాయుడని, విద్యా రంగంలో గోల్డ్ మెడల్ తో కీర్తి పతాక సాధించి, మీడియా రంగంలో  డాక్టరేట్ పట్టాతో అరుదైన ఘనతను సాధించిన వ్యక్తి మన సూర్యాపేట వారు కావడం మనందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా డాక్టర్ బంటు కృష్ణని సన్మానించిన అధికారులు, స్నేహితులు ఈ సందర్భంగా ప్రశంసించారు.