శతమానం భవతి.."విశాల".. 

శతమానం భవతి.."విశాల".. 
  • స్త్రీ శిశు సంక్షేమ శాఖ రంగారెడ్డి జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్ తాండ్ర విశాలకు శుభాకాంక్షల వెల్లువ 

ముద్ర, షాద్ నగర్:శతమానంభవతి..అంటూ రంగారెడ్డి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్, కేశంపేట జడ్పిటిసి విశాల శ్రావణ్ రెడ్డిని జన్మ దినోత్సవం సందర్భంగా చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీవించారు. ఒక స్వచ్ఛంద సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పిటిసి విశాలను నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే  ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.  స్ధానిక ఎఫ్.సి.ఎన్ ఫౌండేషన్ లో అనాధ వృద్దులకు ఏర్పాటు చేసిన అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డితో పాటు నాయకులు వృద్దులకు స్వయంగా అన్నం వడ్డించారు.