కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది.
  • ప్రజలు ఆందోళన చెందవద్దు.
  • రాహుల్ న్యాయ్ యాత్రపై దాడి అవివేకం.
  • కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి.

ముద్ర, ముస్తాబాద్:- ముస్తాబాద్ మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ అస్సాంలో రాహుల్ గాంధీ  భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శాంతియుతంగా యాత్రను కొనసాగిస్తుంటే కొందమంది బిజెపి అల్లరి మూకలు రాహుల్ గాంధీ యాత్రపై దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్దమని మండిపడ్డారు.మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. విద్యుత్ బిల్లులు కట్టకుండా సోనియాగాంధీ ఇంటికి పంపమనడం మాజీ మంత్రి కేటీఆర్ అధికారం పోయి మతిస్థిమితం కోల్పోయినట్లుగా  మాట్లాడుతున్నారని వచ్చే ఎంపీ ఎన్నికల్లో ప్రజలే స్వచ్ఛందంగా చెబుతున్నారని పేర్కొన్నారు.

 కాంగ్రెస్ పార్టీ అన్ని గ్యారెంటీలను అమలు చేస్తుందని ప్రజలు ఆందోళన చెందవద్దని వెల్లడించారు.కాలేశ్వరంలో అక్రమాలకు పాల్పడ్డ బిఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలకు అర్థమైందని వీరి మాటలు నమ్మరని నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాజు జిల్లా ఉపాధ్యక్షుడు  రాములు గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ పెద్ధిగారి శ్రీనివాస్ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్ ఎస్సీ, బీసీ సెల్ మండల అధ్యక్షులు నర్సింలు,ప్రశాంత్ పాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డిi మద్దికుంట రామలక్ష్మణ పల్లె మోర్రయిపల్లె గ్రామశాఖ అధ్యక్షులు కొండయ్య చంద్రమౌళి కొమురయ్య సీనియర్ నాయకులురాంరెడ్డి,బాల్ రెడ్డి, తిరుపతి,లక్ష్మారెడ్డి,రాజమల్లయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేష్,మధు, సత్యంగౌడ్,మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.