కమిషన్ తీసుకోవడం సిగ్గుచేటు

కమిషన్ తీసుకోవడం సిగ్గుచేటు
  • కాంగ్రెస్ నాయకులు రాజా రమేష్

రామకృష్ణాపూర్, ముద్ర: దివ్యాంగులు, వికలాంగులకు పెన్షన్ చెల్లించే క్రమంలో కమిషన్ తీసుకోవడం సిగ్గుచేటని చెన్నూరు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ మండిపడ్డారు. ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని అమ్మ వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన దివ్యాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పుట్ట రవి, కార్యదర్శి శ్రీనివాస్, రవికుమార్, చందర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.