మంచిర్యాలలో కాంగ్రెస్ సంకల్ప దీక్ష

మంచిర్యాలలో కాంగ్రెస్ సంకల్ప దీక్ష

ముద్ర, ప్రతినిధి ,మంచిర్యాల  : రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ మంచిర్యాల గాంధీ పార్కులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంకల్ప దీక్ష చేపట్టారు. శనివారం దీక్షలో కూర్చునే ముందు గాంధీ , నెహ్రు విగ్రహాలకు గాంధీ నెంబరు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్  సాగర్ రావు ,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో నాయకులు ,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సంకల్ప దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ప్రేమ్ సాగర్ రావు, సురేఖ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అక్రమంగా దోచుకున్న బడా పారిశ్రామికవేత్తలను దేశం దాటించి రాహుల్ గాంధీ పై కేసులు నమోదు చేయడం ఎంపీగా అనర్హత వేటు వేయడం శోచనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేయవలసిన సమయం ఆసన్నమైందని వారు అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.