మండు ఎండలోసైతం లెక్కచేయకుండా... ప్రచారంలో కాంగ్రెస్ జెడ్పిటిసి

మండు ఎండలోసైతం లెక్కచేయకుండా... ప్రచారంలో కాంగ్రెస్ జెడ్పిటిసి

ముద్ర, షాద్ నగర్: పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ గెలుపు కోసం జెడ్పిటిసి సభ్యురాలు విశాల శ్రవణ్ రెడ్డి కొత్తూరు మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపే లక్ష్యం.... గా మండుటెండలు సైతం లెక్కచేయకుండా ప్రచార పర్వo చేపట్టి ప్రజలతో మమేకం అవుతున్నారు.ఊరూరా ప్రజల నీరాజనం...గడపగడపకు పథకాల ప్రచారం.కొత్తూరు మండలంలోని ఖాజీగూడ తండా, కోడిచెర్ల తండా, వై ఎం తండా, చింతగూడ తండా లో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు.