అవిశ్వాసానికి సూత్రధారులు కాంగ్రెస్ వారే

అవిశ్వాసానికి సూత్రధారులు కాంగ్రెస్ వారే

మహాదేవపూర్, ముద్ర: ఎంపీపీ పై అవిశ్వాసానికి సూత్రధారులు కాంగ్రెస్ ఎంపీటీసీలేనని, కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ద్రోహానికి పాల్పడి  పుట్ట మధును బదునాం చేయడం తగదని మహాదేవపూర్ ఎంపిటిసి చల్ల రమ తోపాటు ఎంపీటీసీలు అన్నారు. తాము ఐదుగురు ఎంపీటీసీలమే ఉండి అవిశ్వాసం ఎలా పెట్టగలుగుతామని, రాణిబాయి వ్యవహారం నచ్చని కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసిలే శ్రీధర్ బాబు కనుసన్నలలో టిఆర్ఎస్ ఎంపీటీసీల చుట్టూ తిరిగారని, చివరికి ద్రోహం చేసి కాంగ్రెస్ బుద్ధి చూపించుకున్నారని ఎద్దేవా చేశారు. తనపై అవిశ్వాసం పెడితే పుట్ట మధు వద్దకు రాకుండా శ్రీధర్ బాబు చుట్టూ ఎందుకు తిరిగిందని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసినా బన్సోడ రాణిబాయి వార్డు మెంబర్ గా కూడా కాలేకపోయారని, పుట్ట మధు నిజాయితీతో రాణిబాయిని గుర్తించి ఎంపీపీగా పదవిని కట్టబెట్టిన మనసున్న వ్యక్తి పుట్ట మధు అని అన్నారు. రెడ్డి వర్గాలకు పదవిని కట్టబెట్టాలని చూస్తున్నారనడం అవివేకం అన్నారు. ఆన్కారి భవాని, పెండ్యాల మమతలకు పదవులు ఇవ్వడం బీసీలను గౌరవించడం కాదా అన్నారు. రెడ్డి వర్గాలు కాయ కష్టాలు చేసుకొని బతుకుతున్న వారేనని ఆయన పేర్కొన్నారు.