ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలిని సన్మానించిన కాంగ్రెస్ నేత మహమ్మద్ ఇబ్రహీం 

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలిని సన్మానించిన కాంగ్రెస్ నేత మహమ్మద్ ఇబ్రహీం 

ముద్ర ప్రతినిధి, షాద్ నగర్:-  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలిని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం మర్యాద పూర్వకంగా కలిసి ఆయనను సన్మానించారు. శనివారం ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో షబ్బీర్ అలిని ఆయన ఛాంబర్ లో ప్రత్యేకంగా కలుసుకొని పూలబోకే అందజేసి శాలువాతో సత్కరించారు.

మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలో నిత్యం శ్రమిస్తూ ఎంతోమంది మైనార్టీలకు అండగా నిలిచిన షబ్బీర్ అలీ రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన శుభ సందర్భంగా ఆయనను కలుసుకోవడం జరిగిందని ఇబ్రహీం మీడియాకు తెలిపారు. మైనార్టీల సంక్షేమంతో పాటు షెడ్యూల్ కులాలు, గిరిజన, వెనుకబడిన తరగతుల, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం నియమించిన లక్ష్యాన్ని సాధించుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న షబ్బీర్ అలీ రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని, మైనార్టీల కు కొండంత అండగా నిలబడాలని కోరినట్లు తెలిపారు.