రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడం ఖాయం.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవడం ఖాయం.
  • బిఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తుంది....
  • తుంగతుర్తి ప్రాంత బిడ్డ చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ రావడం ఖాయం
  • కాంగ్రెస్ పార్టీతోనే తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
  • తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ


తుంగతుర్తి ముద్ర:-గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేసి కోట్లాది రూపాయలు సంపాదించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు జైలుకు వెళ్లడం ఖాయమని  మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ భారీ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గత పది సంవత్సరాల  బిఆర్ఎస్ పార్టీ పాలనలో అన్ని స్కాంలే జరిగాయని అందుకు ఉదాహరణ కొంతమంది ఇప్పటికే జైలలోకి వెళ్లారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తుందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పేదోళ్ల రాజ్యం వచ్చిందని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు.

ఈ ప్రాంత బిడ్డ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని అమలు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని అన్నారు. రాష్ట్రంలో  బిఆర్ఎస్ బిజెపి పార్టీలు ఓటమి చందడం ఖాయమని అన్నారు. 

తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేల్ మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజార్టీ కన్నా పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ రావాలని అందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని అన్నారు .భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి విజయం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో  బిఆర్ఎస్ బిజెపిల పని అయిపోయిందని అన్నారు.

భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు తాను గెలిస్తే పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల అనురాధ కిషన్ రావు, పీసీసీ మెంబర్ గుడిపాటి నరసయ్య, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బాలలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు తిరుమల ప్రగడ రాహుల్  ,సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ కొండరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు   పెండెం రామ్మూర్తి ,పెద్ద బోయిన అజయ్ కుమార్, తుంగతుర్తి పట్టణ అధ్యక్షుడు రాంబాబులతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు