లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించాలి

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపించాలి
  • ఫరూక్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి 

ముద్ర షాద్ నగర్:పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి  పేర్కొన్నారు. ఫరూక్ నగర్ మండలoలో బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశాన్ని చల్లా శ్రీకాంత్ రెడ్డి సోమ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్ని కల్లో పార్టీ విజయంకోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గడప గడపకు తీసుకె ళ్లాలన్నారు. ఈ విషయంలో ఓటర్లను చైతన్య పరచాల్సిన బాధ్యత ఏజెంట్లు తీసుకోవాలన్నారు. మహబూబ్నగర్  కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిపించాలని ఆన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని  పలు గ్రామాల బూత్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.