గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ మౌనదీక్ష

గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ మౌనదీక్ష

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయాలని నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ను నిరసిస్తూ  మంచిర్యాలలో కాంగ్రెస్ శ్రేణులు మౌన దీక్ష చేపట్టారు. శుక్రవారం పీసీసీ  పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ పార్క్ లోని  గాంధీ విగ్రహం ముందు మౌన దీక్ష నిర్వహించారు.  ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మౌన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పూదరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాహుల్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశంలో ప్రజాస్వామ్యం క్షీణీస్తోందనే ఉద్దేశ్యంతో ఉద్యమిస్తుంటే కేంద్రం జీర్ణించుకోలేక పోతుందని అన్నారు.  పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీని జైలుకు పంపాలనే ఉద్దేశంతో ఉందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రజల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు లభిస్తుందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మార్గమని వారన్నారు.