భారీ మెజార్టీతో భువనగిరిని కైవసం చేసుకున్న కాంగ్రెస్...

భారీ మెజార్టీతో భువనగిరిని కైవసం చేసుకున్న కాంగ్రెస్...
  • 2,22,170 ఓట్ల మెజార్టీ సాధించిన కాంగ్రెస్

ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ 2 లక్షల 22 వేల 170 ఓట్లతో భారీ విజయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కైవసం చేసుకున్నారు. మొదటి రౌండ్ నుండి 23 రౌండ్ల వరకు కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి కాంగ్రెస్ పార్టీ 6,29,143 సాధించి తన సమీప ప్రత్యర్థి పై 2,22,170 ఓట్లతో గెలిచారు. బిజెపి అభ్యర్థి4,06,973 ఓట్లు సాధించి ద్వితీయ స్థానంలో ఉండగా, బిఆర్ఎస్ పార్టీ 2,56187 ఓట్లతో తృతీయ స్థానం, సిపిఎం 28,730 ఓట్లతో నాలుగో స్థానంలో ఉన్నది. స్వతంత్ర అభ్యర్థులు అందరూ 6000 ఓట్లలోపనే ఉన్నారు.

మొదటి రౌండ్ నుండి ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన సమీప అభ్యర్థి బిజెపి పై మొదటి రౌండు నుండి ఆధిపత్యాన్ని కొనసాగించారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ తమ సమీప అభ్యర్థి పై 9800 ఓట్లు, రెండవ రౌండ్లో 18,295, మూడవ రౌండ్లో 26,083 ఓట్లు, నాలుగో రౌండ్లో 37,872, ఐదవ రౌండ్లో 46,793,ఆరవ రౌండ్ లో 58,684 ఏడవ రౌండ్లో 67 027, ఎనిమిదో రౌండ్లో 77,211 9వ రౌండ్లో 91, 692, పదవ రౌండ్లో 1,01,0 46, 11వ రౌండ్లో 1,08,88 ఓట్లు,  12వ రౌండ్లో 1,17,308 ఓట్లు, 13 రౌండ్లో 1,27,400 కోట్లు 14 వ రౌండ్లో 1,41, 251 ఓట్లు, 15వ రౌండ్  1,55,023, 16 వ రౌండ్లో 1,69,933, 17వ రౌండ్లో 1,846 626, 18 వ రౌండ్లో 1, 95,419, 19వ రౌండ్ల 203,540, 20వ రౌండ్ 2,09,914,  21 రౌండ్ 2,15, 673, 22 రౌండ్లో 2,21,276,23 రౌండ్లో 2,22,170ఓట్ల మెజార్టీతో గెలిచారు. 

బిజెపి షాక్..

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ఊహించిన బిజెపికి ఫలితాలు చూసి కండ్లు బైరు కమ్మాయి. మొదటి రౌండ్ నుండి కాంగ్రెస్ ఆధిపత్యం తో ముందంజలో ఉంది. ఇది తెలుసుకున్న బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కౌంటింగ్ హాలు రాకుండానే వెళ్లిపోయారు. కేంద్రంలో బిజెపికి మెజార్టీ సీట్లు వచ్చిన స్థానిక నాయకులలో అసంతృప్తి ఉంది. కేంద్రంలో మోడీ భువనగిరిలో బూర అనే నినాదం బెడిసి కొట్టింది. అదేవిధంగా టిఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేష్  కౌంటింగ్ హాల్ రాలేదు ముఖ్యమైన నాయకులు కౌంటింగ్ వద్దకు రాలేదు ముందస్తుగా వారు ఓడిపోతామని ప్రిపరేషన్ లో ఉన్నారు.

ఆనందంలో కాంగ్రెస్ శ్రేణులు ...

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలారు. నియోజకవర్గంలో మొదటిసారి ఎన్నికల జరిగినప్పుడు ఒక లక్ష పైచిలుకు ఓట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొందగా, బూర నర్సయ్య గౌడ్ 30 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందగా మూడవసారి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదువేల పైచిలుకు ఓట్లతో మాత్రమే గెలుపొందారు కానీ నాలుగో సారి ఎవరు ఊహించని విధంగా 2,22,170 విజయం సాధించారు.