మిషన్ 50 డేస్ టార్గెట్ విలేజ్ టు విలేజ్ ను జయప్రదం చేయండి

మిషన్ 50 డేస్ టార్గెట్ విలేజ్ టు విలేజ్ ను జయప్రదం చేయండి

యం యస్ పి జిల్లా నాయకుడు బి.ప్రసాద్ మాదిగ 

ముద్ర, మఠంపల్లి: హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లోని యస్సి,యస్టి, బి సి,మైనార్టీ, పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా మిషన్ 50 డేస్ టార్గెట్ విలేజ్ టు విలేజ్ ప్రతి గ్రామంలో యం ఆర్ పి యస్ ,ఎంఎస్పీ దాని అనుబంధ సంఘాల పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు 50 రోజుల కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రజలను కలుస్తూ వివరించాలని ఆదేశించారు.

75 సంవత్సరాల కాలంలో అంటరాని వారిగా వెనుక బడిన జాతిని సమాజంలో గుర్తుండేలా సామాజిక ఉద్యమాల నాయకుడు మంద కృష్ణమాదిగ నిర్ణయం తో 1994 సంవత్సరంలో దండోరా ఉద్యమం మొదలై యస్సి లను జనాభా ప్రాతిపదికన వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ పాలక ప్రభుత్వాలపై పోరాడి సాధించుకున్న ఫలితాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.