అధికార గర్వంతో స్థానిక కాంగ్రెస్ నేతల కుట్రలు

అధికార గర్వంతో స్థానిక కాంగ్రెస్ నేతల కుట్రలు
  • ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నదని స్థానిక కాంగ్రెస్ నాయకులు విర్రవీగుతున్నారని, ఎన్నిచేసినా అభివృద్ధిని అడ్డుకోలేరని ముథోల్ ఎమ్మెల్యే  రామారావు పటేల్ అన్నారు. బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ రాక సందర్భంగా భైంసా లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో  రూ.150 కోట్ల అభివృద్ధి పనులు తెచ్చిన ఘనత తనదన్నారు. కేంద్రంలో అధికారంలో తామున్నామని, మళ్లీ వచ్చేది తమదేనని అన్నారు. రాష్ట్రంలో పాలన సాగాలంటే కేంద్రంపై ఆధార పడాల్సిందేనన్నారు. ప్రజా ఆశీర్వాదంతో గెలిచానని, ప్రజల కోసమే పని చేస్తానని, అధికారం కోల్పోయిన వారు ఇస్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎంపి అభ్యర్థి నగేష్ తదితరులు పాల్గొన్నారు