కానిస్టేబుల్ మిస్సింగ్ ... కేసు నమోదు
- ఆర్థిక సమస్యలే కారణం...?
ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా పానుగల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ (పిసి 2234) అనే కానిస్టేబుల్ మిస్సింగ్ కలకలం రేపింది. పోలీసుల నుండి అందిన సమాచారం మేరకు పానగల్ పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ గత రాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. పానగల్ పిఎస్ నుండి ఎస్కార్ట్ పిసి గా చివరిసారిగా విధులను నిర్వహించాడు. ఆ తర్వాత రామకృష్ణ జాడ లేకుండా పోవడంతో అతని భార్య మంజుల ఫిర్యాదు చేసింది.
ఆర్ధిక ఇబ్బందులతో విధులు చేయలేకపోతున్నానని ఒక మెసేజ్ తన భార్య మంజులకు పెట్టి ఇంటి నుండి వెళ్లిపోయాడు. రామకృష్ణ ఎక్కడికి వెళ్లాడన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతుండడంతో అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంజుల ఫిర్యాదు పై FIR మ్యాన్ మిస్సింగ్ నమోదు చేసి రామకృష్ణ ఆచూకీ కొరకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి వెతకడానికి ప్రయత్నం చేస్తున్నారనీ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీరామదాసు తేజావత్ తెలిపారు. ఇదిలా ఉండగా ఆర్థిక ఇబ్బందుల వల్లే కానిస్టేబుల్ కనిపించకుండా పోయాడని తెలుస్తుంది.