దూర భారం తగ్గించడానికి అంతర్గత రోడ్ల నిర్మాణం

దూర భారం తగ్గించడానికి అంతర్గత రోడ్ల నిర్మాణం

ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్        
ముద్ర, ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ  గ్రామ ప్రజలకు దూర భారం తగ్గించడానికి అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని స్థానిక  ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ శనివారం అన్నారు.సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామం లోని షాదీ ఖానా నుండి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పక్క నుండి సిరిసిల్ల - కామారెడ్డి ప్రధాన రహదారి వరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మట్టి రోడ్డు నిర్మాణం చేస్తామని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ పేర్కొన్నారు. అదేవిధంగా ఉమాశంకర్ శర్మ ఇంటి నుండి రెండవ బైపాస్ రోడ్డు వరకు మట్టి రోడ్డు నిర్మాణం చేస్తామని ఉపసర్పంచ్ తెలిపారు.30 ఫీట్ల తో ఇట్టి రోడ్డు నిర్మాణం జరుగుతుందని  ఆమె అన్నారు. గ్రామంలో అవసరమైన చోట మట్టి రోడ్డు నిర్మాణం లు చేపడుతామని రోడ్లు అవసరమైన వారు పాలక వర్గం దృష్టికి తీసుకురావాలని ఉపసర్పంచ్ గ్రామ ప్రజలను కోరారు.  ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ వెంట వార్డు సభ్యులు జవ్వాజి లింగం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అధికారి ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి దేవరాజు, బి ఆర్ ఎస్ నాయకులు  ఎనగందుల బాబు,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఉన్నారు.