కోట్లాది రూపాయల వ్యయంతో తుంగతుర్తి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం

కోట్లాది రూపాయల వ్యయంతో తుంగతుర్తి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం
  • గత పాలకుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తమైన రవాణా సౌకర్యం శిథిలావస్థకు చేరిన రోడ్లు
  • నియోజకవర్గ అభివృద్ధిని మరిచిన గత పాలకులు
  • రోడ్ల నిర్మాణంతో రూపురేఖలు మారనున్న తుంగతుర్తి నియోజకవర్గం
  • తుంగతుర్తి మండలం వెలుగుపల్లి సమీపంలో ఉన్న 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి

తుంగతుర్తి ముద్ర:- గడచిన పది సంవత్సరాల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడిందని ముఖ్యంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు.బుధవారం తుంగతుర్తి మండలంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడారు. తుంగతుర్తి నుండి రావులపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, అలాగే తిమ్మాపురం సంఘం కోడూరు చిల్పకుంట్ల మీదుగా నూతనకల్ వరకు రోడ్డు నిర్మాణం ,అలాగే వెలుగు పెళ్లి హైవే నుండి పరసాయిపెళ్లి వరకు రోడ్డు నిర్మాణం పనులు శంకుస్థాపనలు చేయడం జరిగిందని వెంటనే పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే అన్నారు. కోట్లాది రూపాయల నిధులతో పూర్తిగా రవాణాకు పనికిరాని రోడ్లను నిర్మాణం చేపడుతున్నామని ఇది గత పాలకుల నిర్వాకమైన అని అన్నారు. గడచిన పది సంవత్సరాలు నియోజకవర్గంలో ఏ ఒక్క రోడ్డు కూడా నిర్మాణం చేయలేదని అన్నారు .గ్రామాల్లో తండాల్లో సిసి రోడ్ల సౌకర్యం గడిచిన మూడు నెలల కాలంలోనే చేశామని అన్నారు .

తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన ధ్యేయమని ఎమ్మెల్యే సామేల్ అన్నారు .ఇటీవలనే నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కి  భూమి పూజ నిర్వహించామని పనులు వేగవంతంగా సాగుతున్నాయని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో త్వరలోనే ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామ సమీపంలోని 100 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిలో పరిశ్రమల ఏర్పాటుకు తాను కృషి చేయగలనని అన్నారు ..ప్రజలు తనమీద ఉంచిన భారాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని అన్నారు. నియోజకవర్గంలో తాను ఉద్యమ కాలం నుండి అన్ని గ్రామాల్లో పర్యటించారని ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు తనకు తెలుసునని ఏ ఒక్క గ్రామం వదిలిపెట్టకుండా అభివృద్ధి చేస్తానని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలోని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబడేలా చేస్తానని అన్నారు. ముఖ్యంగా తుంగతుర్తి పట్టణ ప్రజలు తనకు అఖండ మెజారిటీ ఇచ్చారని తుంగతుర్తి పట్టణ ప్రజలకు ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటానని అన్నారు .అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా తనకు మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉన్నారని అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని కచ్చితంగా ఇల్లు లేని పేదలకు అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తుంగతుర్తి నుండి రావులపల్లి వెళ్లే రోడ్డుకు శంకుస్థాపన, అలాగే రైతు సేవ సహకార సంఘం నూతన భవన ప్రారంభం ,అదేవిధంగా టి జి ఆర్ పి ఆర్ పి బాలికల పాఠశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల ప్రగడ అనురాధ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కిషన్ రావు జిల్లా నాయకులు శ్రీనివాసరావు సీనియర్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ తుంగతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు రాంబాబు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొండరాజు లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు