సిపిఐ ఎన్నికల గుర్తు ‘‘కంకి-కొడవలి’’ కొనసాగింపు

సిపిఐ ఎన్నికల గుర్తు ‘‘కంకి-కొడవలి’’ కొనసాగింపు

కూనంనేని సాంబశివరావు
ఖమ్మ:  తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీకి రాష్ట్ర స్థాయి గుర్తింపును కొనసాగిస్తున్నట్లుగా తెలంగాణ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఒక నోటిఫికేషన్‌ ద్వారా సిపిఐ తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌కి తెలియజేసింది. భారత దేశంలో కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా రాష్ట్ర గుర్తింపును కొనసాగిస్తున్నట్లుగా ఆ నోటిఫికేషన్‌లో వివరించారు. 2018 ఎన్నికల గుర్తులకు సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ఉన్నటువంటి నిర్మాణం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రస్థాయి గుర్తింపును కొనసాగిస్తున్నట్లుగా, స్థానిక సంస్థలతోపాటు, రాష్ట్రంలో పార్టీ ప్రాతిపదికగా జరిగే అన్ని ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ గుర్తు ‘‘కంకికొడవలి’’ ని యదాతధంగా కొనసాగిస్తున్నట్లు

నోటిఫికేషన్‌ ద్వారా ఎన్నికల కమిషన్‌ తెలియజేసినట్లు రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. జాతీయ స్థాయి హోదాను కూడా త్వరలోనే తిరిగి పొందగలిగే అవశాకాశాలు ఉన్నందున కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు, కమ్యూనిస్టు పార్టీని ఆదరిస్తున్న ఓటర్లు అందరూ మరింత విశ్వాసంతో పార్టీని నిర్మించుకుంటూ, పార్టీని పురోగమనం వైపు తీసుకెళ్లడంలో మరింత పట్టుదలతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.