బీఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

బీఆర్ఎస్ లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
  • నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి తదితరుల రాజీనామా

    ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో భారత రాష్ట్ర సమితిలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా నిర్మల్ మండలాధ్యక్షులు కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మునిసిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే పార్టీ  జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి సహా పలువురు రాజీనామా చేసిన నేపథ్యంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధి కోసం తాము కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు