కాంట్రాక్టులు ఇవ్వకుంటే.. కుటుంబాలు వీధిన పడతాయి...    

కాంట్రాక్టులు ఇవ్వకుంటే.. కుటుంబాలు వీధిన పడతాయి...    
  • క్లాస్ 2,3 కాంట్రాక్టర్ల ఆందోళన       
  • పనులు ఇప్పించి ఆదుకోవాలని వరంగల్  టిఎస్ ఎన్ పి డి సి  ఎల్ "సిఎండి"కి   కాంట్రాక్టర్ల వినతి.        

వెల్గటూర్, ముద్ర :  విద్యుత్ కు సంబంధించి రూ. 2లక్షల లోపు కాంట్రాక్టు పనులను క్లాస్ 1 కాంట్రాక్టర్లతో పాటుగా, మాకు కూడా ఇవ్వాలని వాటికీ సంబంధించిన  లైసెన్సులు పొందిన  క్లాస్ -2, క్లాస్-3 కాంట్రాక్టర్లు  కోరుకుంటున్నారు. ఈ మేరకు వరంగల్ టిఎస్ ఎన్ పి డి సి  ఎల్ "సిఎండి"కి  క్లాస్-2, 3 కాంట్రాక్టర్లు వినతి పత్రాన్ని అందజేశారు. కాగా గతంలో క్లాస్ -1,2,3 కాంట్రాక్టర్లందరికీ  రూ.2లక్షల లోపు పనులు చేసేందుకు కోసం   నామినేషన్లు వేసే అవకాశం కల్పించేది. కాగా ఈ మధ్యకాలంలో  వాటికి సంబంధించిన  కాంట్రాక్టు పనులను  క్లాస్-1 కాంట్రాక్టర్లకు మాత్రమే ఇవ్వాలని డిపార్ట్మెంట్ నిర్ణయం  తీసుకున్నట్లు సమాచారం. దీనితో వాటి పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న  క్లాస్- 2,3 కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. క్లాస్-1 కాంట్రాక్టర్లకే పనులను అప్పగిస్తే మా పరిస్థితి ఏందని, పనులు చేయకుంటే మా కుటుంబాలు వీధినపడే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో 6 నుంచి 8 మంది క్లాస్ 2,3 కి సంబంధించిన కాంట్రాక్టర్లు ఉన్నారని, రాష్ట్రమంతటా కలిపి120 మంది వరకు ఉంటారని పేర్కొన్నారు.  రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరిని దృష్టిలో పెట్టుకొని "పాత పద్ధతి"ని కొనసాగించి మా కుటుంబాలు వీధిన పడకుండా చూడాలని క్లాస్ 2,3 కాంట్రాక్టర్లు అధికారులను కోరుకుంటున్నాను..