జనసందోహంతో నిండిన కాకినాడ సమద్రతీరం
జనసందోహంతో నిండిన కాకినాడ సమద్రతీరం
కాకినాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా సూధూర ప్రాంతాల నుండి తరలివచ్చిన బంధుమిత్రులతో ప్రతి ఇంటిలోను సందడి వాతావర ణం నెలకుంది. వీరంతా ఆహ్లాదకరమైన వాతవారణంలో కాలం గడిపేందుకు విహార యాత్రలకు వెళ్తున్నారు. అందులో భాగంగా కాకినాడ సాగరతీరం జనసందోహంతో నిండిపోయింది. సముద్ర స్నానాలు చేసి చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.
అలాగే బీచ్లో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించారు. రంగుల రాట్నం, జారుడుబల్ల, జెయింట్ వీల్ ఎక్కి, ఆనందకర వాతావరణంలో కాలం గడిపారు. కాకినాడ సాగరతీరంలో సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉండటంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలిసులు గస్తీ నిర్వహించారు.