కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి - డి సి సి అధ్యక్షుడు శ్రీహరి రావు

కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించండి - డి సి సి అధ్యక్షుడు శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పేద కుటుంబాల్లో వెలుగు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీ తో గెలిపించాలని డి సి సి అధ్యక్షుడు శ్రీహరి రావు అన్నారు. సారంగపూర్ మండలం చించోలి (బి), సారంగపూర్, కౌట్ల (బి) గ్రామాల్లో  లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేతలు సోమవారం స్వీకారం చుట్టారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేసే గ్యారంటీ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తు చ తప్పకుండా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని అన్నారు. ఆగస్ట్ 15 లోపు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలు మాత్రం రాజకీయంగా లబ్ధి పొందడానికి తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆదివాసి గిరిజన మహిళలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని, వచ్చే నెల మే 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సారంగపూర్ జడ్పిటీసి పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు బొల్లోజీ నర్సయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజమహమ్మద్, ఎంపీపీ ఆడే సవిత, వెంకట్రాంరెడ్డి, పోతారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దశరథ్ రాజేశ్వర్, ఆది, భోజా రెడ్డి, సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలతో భేటీ

సారంగపూర్ మండలం కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుగుణ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని శ్రీహరి రావు కోరారు.