రైతు రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకం

రైతు రుణమాఫీ నిర్ణయం చారిత్రాత్మకం
  • డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు
  • నిర్మల్ లో కాంగ్రెస్ సంబరాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఏకకాలంలో రూ.2 లక్షల మేరకు రైతు రుణాలను మాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ నాయకులు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రూ. 31 వేల కోట్ల మేర రుణమాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ రైతు పక్షపాతి అని, మాటిస్తే దానిపై నిలబడుతుందని మరోసారి రుజువైందని అన్నారు. రైతుల పక్షాన సీఎం రేవంత్‌ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.