కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటా

కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటా
  • భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్

తుంగతుర్తి ముద్ర:- భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానని జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు పీసీసీ అధిష్టానం తన విజ్ఞప్తిని పరిశీలిస్తుందని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు .శుక్రవారం గాంధీభవన్లో భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అనంతరం మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తాను ఎన్ ఎస్ యు ఐ, యువజన కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో పనిచేశానని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా రెండు పర్యాయాలు పనిచేశానని అలాగే ప్రస్తుతం సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్షునిగా కొనసాగుతున్నానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నానని అన్నారు .కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నమోదులో దేశంలోనే సూర్యాపేట జిల్లా అగ్రహారంలో నిలిచిందని అన్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అలాగే మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్లు తనకు భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉందని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు రేటినేని శ్రీనివాసరావుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.