జన్మదిన వేడుకలలో పాల్గొన్న డిసిసిబి చైర్మన్ గొంగిడి

జన్మదిన వేడుకలలో పాల్గొన్న డిసిసిబి చైర్మన్ గొంగిడి

ముద్ర ఆలేరు న్యూస్ : నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ప్రవీణ్ కుమారుడు వేదాన్ష్ మొదటి జన్మదిన వేడుకలు కొలనుపాక బిఎస్ఎన్ రెడ్డి గార్డెన్లో హాజరై వేదాన్స్ ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్, కొలనుపాక గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పిఎసిఎస్ డైరెక్టర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.