ఒకటో తరగతి చిన్నారిపై డ్యాన్స్ టీచర్ అసభ్య ప్రవర్తన
ఒకటో తరగతి చిన్నారిపై డ్యాన్స్ టీచర్ అసభ్య ప్రవర్తన
బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: బోడుప్పల్ లోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలలోని డ్యాన్స్ టీచర్ చిన్నపిల్లలపై లైంగికదాడికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింద. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో డ్యాన్స్ మాస్టర్ రవి ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆ టీచర్ ను చితకబాదారు. డ్యాన్స్ టీచర్ రవిని కిందపడేసి తన్నారు. ఆవేశంతో దూషిస్తూ చేయిచేసుకున్నారు. ఇదిలా ఉంటే స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. తమకు ఫిర్యాదు చేయాలని, ఇలా దాడి చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులను ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. పిల్లల్ని బడికి పంపాలంటేనే భయమేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆ టీచర్ తో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.