పొగమంచుతో పొంచి ఉన్న ప్రమాదం

పొగమంచుతో పొంచి ఉన్న ప్రమాదం
  • పండగపూట ప్రయాణికులకు పోలీస్ వారి హెచ్చరిక

ముద్ర ప్రతినిధి , కోదాడ :- సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే ప్రయాణికులతో జాతీయ రహదారి 65 రద్దీగా మారుతుంది . దాదాపు సగం మంది పట్నం వాసులు ఆంధ్రా పల్లెబాటలు పట్టటం అందరికి తెలిసిన విషయమే . అయితే కార్లలో మరియు ఇతర వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులు తెల్లవారుజామున కురుస్తున్న పొగ మంచుతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీస్ వారు . ఒక వైపు రద్దీ , మరోవైపు పొగమంచు తో వాహనదారులు ప్రమాదాల భారీన పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు పగటిపూట ప్రయాణానికే ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ వారు కోరుతున్నారు . ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 15 చోట్ల యాక్సిడెంట్ జోన్ లను గుర్తించారు . ముఖ్యంగా ఈ కూడళ్లలో చాలా నెమ్మదిగా వెళ్లాలని పోలీస్ వారు సూచిస్తున్నారు . వాటికి సంబంధిచిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి . 

హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయరహదారి పై ప్రమాదకర ప్రాంతాలు

  • నల్లగొండ జిల్లాలో

1. పెద్దకాపర్తి 
2. ⁠చిట్యాల 
3. ⁠నల్లగొండ క్రాస్ రోడ్ 
4. ⁠కట్టంగూర్ 
5. ⁠కొర్లపహాడ్ 

  • సూర్యాపేట జిల్లా

1. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీ
2. జనగాం క్రాస్ రోడ్ 
3. ⁠ఈనాడు ఆఫీస్ క్రాస్ రోడ్ 
4. ⁠దురాజ్ పల్లి 
5. ⁠ముకుందాపురం 
6. ⁠ఆకుపాముల బైపాస్ క్రాస్ 
7. ⁠కొమరబండ క్రాస్ 
8. ⁠కట్టకమ్మగూడెం క్రాస్ 
9. ⁠దుర్గాపురం క్రాస్ 
10. ⁠రామాపురం క్రాస్