తప్పులు లేకుండా డేటా ఎంట్రీ పూర్తి చెయ్యాలి

తప్పులు లేకుండా డేటా ఎంట్రీ పూర్తి చెయ్యాలి

ముద్ర ప్రతినిధి , కోదాడ:- ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల డేటాను తప్పులు లేకుండ సకాలంలో ఎంట్రీ చెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట రెడ్డి అధికారులను ఆదేశించారు . శనివారం మునగాల తహశీల్ధార్ కార్యాలయంలో జరుగుతున్న డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు . డేటా ఎంట్రీలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చూడాలని  సిబ్బందిని ఆదేశించారు . ఆయన వెంట మునగాల తహశీల్ధార్ ఆంజనేయులు ఉన్నారు .