కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు
  • బిజెపి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాష్ట్ర బిజెపి కిసాన్ సెల్ సభ్యురాలు దాయం ఝాన్సీ రెడ్డి
  • కాంగ్రెస్ కండువా కప్పి గుడిపాటి సైదులును , దాయం ఝాన్సీ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మందుల సామెల్
  • కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులతో ఖాళీ అవుతున్న విపక్షాలు
  • పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్దే
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్


తుంగతుర్తి ముద్ర:- సూర్యాపేట జిల్లా డిసిసిబి డైరెక్టర్ డి సి ఎం ఎస్ సభ్యుడు తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు బిఆర్ఎస్  పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం తుంగతుర్తి శాసనసభ్యులు మందుల  సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బిజెపి రాష్ట్ర కిసాన్ సెల్ సభ్యురాలు దాయం ఝాన్సీ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేసి శాసనసభ్యులు మందుల సామెల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బి ఆర్ ఎస్  పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సైదులుకు బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్న ఝాన్సీ రెడ్డిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విపక్షాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని తుంగతుర్తి నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కోట్లాది రూపాయల అభివృద్ధి నిధులతో అభివృద్ధి పనులను మెరుగుపరుస్తున్నామని అన్నారు.

ఇప్పటికే పలురోడ్లకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించి పురోగతిలో ఉన్నాయని మరికొన్ని ఎన్నికల కోడ్ అనంతరం ప్రారంభమవుతాయని అన్నారు. తుంగతుర్తిలో వంద పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు చేయించి శరవేగంగా పనులు జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు.

ఆగస్టు 15 లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని అన్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పిసిసి మెంబర్ గుడిపాటి నరసయ్య, తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడు దొంగర గోవర్ధన్ ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తిరుమల ప్రగడ కిషన్ రావు ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మడ్డి కృష్ణమూర్తి  , సోమ్లా నాయక్, పెద్దబోయిన అజయ్ కుమార్,  లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.