సామాన్యునికి ప్రశ్నించే హక్కు ఉంది: అడిషనల్ డీసీపీ మహేందర్.

సామాన్యునికి ప్రశ్నించే హక్కు ఉంది:  అడిషనల్ డీసీపీ మహేందర్.

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి: సమాన్యుల చేతిలో వజ్రాయుధం సమాచార హక్కు చట్టమని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డిసిపి మహేందర్ అన్నారు. కౌన్సిల్ ఫర్ సిటీజేన్ రైట్స్ (సీసీఆర్) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2005 లో తెచ్చిన సమాచార హక్కు చట్టం సామాన్యుల చేతిలో వజ్రాయుధం అని అన్నారు. భారత దేశ పౌరులందరికి పాలన వ్యవస్థపై పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యవస్థలో జరుగుతున్న పాలన విధానాన్ని తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. ప్రజలకోసం నిర్వహించే నిధులు ఎలా ఖర్చు అవుతున్నాయో కూడా సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు. ప్రతి ఆర్ టి ఐ కార్యకర్త చురుకుగా పని చేయాలని.. చట్టం విషయంలో సీసీఆర్ చొరవ ఆభినదనీయమని అన్నారు.

పట్టణాల్లో కాకుండా పల్లెల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. తెలంగాణలోనే మొదటి సారిగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల.. ప్రజాప్రతినిధుల సహకారంతో సీసీ టీవీ లు ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి సదస్సులకు తమ వంతు సహాయం అందిస్తామని ఈ సందర్బంగా నిర్వాహకులను అభినందించారు. అనంతరం సీసీఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు మంచకట్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పారదర్శక పాలన సాధ్యమని అన్నారు. అవినీతి నిర్ములనే సీసీఆర్ మొదటి లక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డు తనీకీలు నిర్వహించామని చాలా చోట్ల అవునీతి బయట పడిందని అవినీతికి పాల్పడిన అధికారులపై ప్రభుత్వ చర్యలు కూడా తీసుకుందని గుర్తు చేశారు.

భవిష్యత్ లో సంస్థ కార్యకలాపాలు ఒక్క సమాచార హక్కు చట్టంపైనే కాకుండా ఎడ్యుకేషన్, సామాజిక ఉపాధి కల్పనలపై కూడా దృష్టి సారించనుందని అన్నారు. అద్భుతంగా, విజయవంతమైన జాతీయ సదస్సును నిర్వహుంచినందుకు గాను సిద్దిపేట జిల్లా సీసీఆర్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు సీసీఆర్ తరుపున సర్టిఫికెట్ లు అందజేశారు. కార్యక్రమంలో సీసీఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రభు, దేవరాజు, శ్రీనివాస్, సాజిద్ పాషా

సీసీఆర్ జిల్లా సభ్యులు గుండ్ల శివ చంద్రం, సురేందర్ రెడ్డి,

మధు ,ఇల్యాసుద్దీన్, కృష్ణ, మధు, స్వామి, అడ్వకేట్ పత్రి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.