టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం  లీకు కేసులో విద్యార్థిపై డిబార్ ఎత్తివేత

టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం  లీకు కేసులో విద్యార్థిపై డిబార్ ఎత్తివేత

ముద్ర, తెలంగాణ బ్యూరో : టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డిబార్ ను రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. వరంగల్ జిల్లా కమలాపుర్ జెడ్పీ బాలుర హైస్కూల్ పరీక్ష కేంద్రంలో  టెన్త్ హిందీ పేపరు లీకు కావడంతో విద్యార్థి హరీశ్​ను డీఈవో డీబార్ చేశారు. దీనిపై విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో హరీశ్​పదో తరగతి పరీక్షలు రాశాడు. అయితే హరీశ్ పదో తరగతి ఫలితాలను అధికారులు హోల్డ్​లో పెట్టారు. ఈ నేపథ్యంలో హరీశ్​పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది.