ఏసీబీకి చిక్కిన రెచపల్లి పంచాయతీ కార్యదర్శి

ఏసీబీకి చిక్కిన రెచపల్లి పంచాయతీ కార్యదర్శి
  • రోడ్డు పనుల బిల్లుల గురించి డబ్బులు డిమాండ్.
  • వివరాలు వెల్లడించిన ఎసిబి డిఎస్పి భద్రయ్య

సారంగాపూర్ ముద్ర: సారంగాపూర్ మండలంలోని రెచపళ్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి  స్థానిక ఎడమల లక్ష్మారెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి 10000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కే భద్రయ్య తెలిపారు. రేచపల్లి గ్రామ సర్పంచ్ ఎడమల జయ భర్త ఎడమల లక్ష్మారెడ్డి రెండు సంవత్సరాల క్రితం ఉపాధి హామీ పథకం గ్రామంలోని తురక్కశా కాలనీ లో ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టాడు.నెల రోజుల క్రితమే బిల్లులు మంజూరు కాగా పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి చెక్కు రాయమని ఎన్నిసార్లు విన్నవించిన రాయలేదు. ఇదే విషయమై జగిత్యాల డిపివో  నరేష్ కు 15 రోజుల క్రితం ఫోన్ ద్వారా సమాచారం అందించిన ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 17న కరీంనగర్ ఏసీబీ డిఎస్పి కే భద్రయ్యను కలిసి డబ్బులు డిమాండ్ విషయం వివరించారు.

డబ్బులు డిమాండ్ విషయమై నిర్ధారణ చేసుకున్న భద్రయ్య లక్ష్మయ్యకు పదివేల రూపాయలు ఇచ్చాడు. లక్ష్మయ్య ఈరోజు ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి కి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య అకస్మాత్తుగా విజయలక్ష్మి చేతిలోని పదివేల రూపాయలను స్వాధీనం చేసుకొని కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు ఎసిబి డిఎస్పి భద్రయ్య తెలిపారు. పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి  అక్రమంగా రూపాయల డిమాండ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఆమెను అరెస్టు చేయడమైనదని డిఎస్పి తెలిపారు. కాగా నిందితురాలను ఈరోజు కరీంనగర్ లోని ఏసీబీ స్పెషల్ కోర్ట్ లో హాజరు పరచనున్నట్లు డిఎస్పి వివరించారు. ఆయన వెంట ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు తిరుపతి అరవింద్ జాన్ రెడ్డి సిబ్బంది ఉన్నారు.

అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారుపంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి.అన్యాయంగా అక్రమంగా నన్ను ఈ కేసులో ఇరికించారని  పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి అన్నారు. నేను గ్రామ సర్పంచ్ ఎడమల జయ భర్త లక్ష్మారెడ్డి ని డబ్బులు డిమాండ్ చేయలేదని అన్నారు. ఇప్పటివరకు ఈ గ్రామానికి ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు మారినట్లు ఆమె తెలిపారు.