పురాతనమైన వెంకటగిరి కొండపై శివలింగం  కూల్చివేత

పురాతనమైన వెంకటగిరి కొండపై శివలింగం  కూల్చివేత

ముద్ర, షాద్‌నగర్:-నందిగామ మండల పరిధిలోని నరసప్పగూడ గ్రామానికి చెందిన  వెంకటగిరి కొండ పైన ఉన్న పురాతన కాకతీయుల కాలం నాటి శివాలయంలోని గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.ఈ విషయాన్ని గ్రామస్థులు   గుర్తించి స్థానిక పోలీసు స్టేషనులో పిర్యాదు చేశారు. ఇట్టి సంఘటనపై, గ్రామస్తులు మాట్లాడుతూ..శివలింగాన్ని కావాలనే కొందరు దుండగులు శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో లింగం చితికిపోయింది.ఈ సంఘటనతో భక్తులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం అని పర్యాటకంగా పేరుగాంచిన స్థలంలో విధ్వంసం సృష్టించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

శివలింగాన్ని ద్వంస్సం చేసిన దుండగులను తక్షణమే కఠినంగా శిక్షించాలి

బిజెపి  నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్దలతో పూజలు అందుకుంటున్న శివలింగాన్ని ధ్వంసం స్థలాని బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా పూజించే శివలింగాన్ని ద్వస్సం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడం పిరికిపందల చర్య అని అన్నారు.దుండగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు భాజపా ఆధ్వర్యం లో ఆందోళనలు చేపడుతామని అన్నారు.గతం లో జరిగిన వేదగిరి ఘటన అనంతరం జరిగిన పరిణామలను గుర్తుచేశారు.రెండు రోజుల్లో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోకపోతే  బిజెపి ఆధ్వర్యం లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమములో  విశ్వహిందుపరిషత్ రాచప్ప , మోహన్ సింగ్ , లష్కర్ నాయక్, బండి కిరణ్ గ్రామస్థులు లక్ష్మణ్ గౌడ్, అరవింద్, వెంకటేష్,,అశోక్ తదితరులు పాల్గొన్నారు.