రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చింది

రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చింది
  • *కొండగట్టు అంజన్నను దర్శించుకున్న 
    చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి

ముద్ర, మల్యాల: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళ వారం చెన్నూరు నియోజక వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేకపూజలు చేశారు. తన అభిమానులు 105 కొబ్బరికాయలు కొట్టి  మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడతూ తను గెలిచిన తర్వాత అంజన్న దర్శించుకోవాలని, రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ప్రజా పాలన రావాలని అంజన్న ను మొక్కుకున్నట్లు తెలిపారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు కావాలని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజల పక్షాన ప్రగతి భవన్ ఇనుప కంచేలు బద్దలు కొట్టి ప్రజలకు విశ్వాసం కల్పించామని అన్నారు. ఎమ్మెల్యే లకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద విడుదల చేసిన 10 కోట్ల రూపాయలు ఆభివృద్ధికి వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ వల్ల  ఏర్పడిన సమస్యలను, తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. తిరుగు ప్రయాణంలో కోతులకు పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.