డెంగ్యూ వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యత....

డెంగ్యూ వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యత....

మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ

కోదాడ, ముద్ర:డెంగ్యూ వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యత అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని కాశీనాదం ఫంక్షన్ హాల్ లో జాతీయ డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైద్య  ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.ప్రతి ఇంటి యజమాని తమ బాధ్యతగా, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. డెంగ్యూ వ్యాధి కి కారణం అయిన దోమల వ్యాప్తిని నివరించాలన్నారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్రైడే, డ్రై ,డే కార్యక్రమంలో అందరూ బాగస్వాములు కావాలన్నారు. కోదాడ పట్టణాన్ని దోమల రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని కోరారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా  పట్టణ వైద్య సిబ్బంది,ఆశ వర్కర్లు, మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.