బండికి డిప్యూటీ హోమ్ మినిస్టర్

బండికి డిప్యూటీ హోమ్ మినిస్టర్
  • మోడీ 3.0 లో  సంజయ్ కి సముచిత స్థానం
  • గట్స్ ఉన్న బండికి పవర్ ఫుల్ శాఖ
  • తెలంగాణ వ్యాప్తంగా బిజెపి శ్రేణుల సంబరాలు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :కేంద్ర మంత్రివర్గంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శాఖని కేటాయిస్తూ మోడీ నిర్ణయం తీసుకున్నారు. మోడీ 3.0 ప్రభుత్వంలో బండికి సముచిత స్థానం లభించింది. జిల్లాకు డిప్యూటీ హోమ్ మినిస్టర్ రావడం ఇది రెండవసారి. ఇంతకుముందు విద్యాసాగర్ రావుకు వివరించగా ఇప్పుడు బండి సంజయ్ కి అదే శాఖను కేటాయించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.